Monday, December 13, 2010

జాక్ పాట్ కొట్టిన సమంత



తెలుగు లో చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వడం తో సమంత కి తెలుగు లో డిమాండ్ పెరిగిపాయింది. తెలుగు ఇండస్ట్రి టాప్ డైరెక్టర్ రాజమౌళి ఈ ముద్దుగుమ్మను తన డ్రీం ప్రాజెక్ట్ లో హీరొయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు.

అందుకు సమంత కి రాజమౌళి తీసే తరువాత సినిమా లో హీరొయిన్ గా తీసుకుంటాను అనడం తో ఈ మలయాళీ కుట్టి మరు మాట్లాడ కుండ డేట్స్ ఇచ్చిందంట.

తెలుగు లో వరుస హిట్స్ తో దూసుకు పోతున్న సమంత మహేష్ బాబు సరసన శ్రీను వైట్ల దర్సకత్వం లో నటిస్తుంది. సమంత మంచి సినిమాలు చేయాలనీ ఇంకా పెద్ద హిట్స్ ఇవ్వాలని ఆశిద్దాం.

నాగబాబు పై జెనిలియా విసుర్లు



ఆరంజ్ సినిమా ఫ్లాప్ కావటం తో నాగబాబు చాల బడపద్దట్లుగా తెలుస్తుంది. ఆ విషయం మిరపకాయ ఆడియో రిలీజ్ చుసినవరందరి తెలుస్తుంది. వేదిక మీద నాగబాబు బాస్కర్ ను ఉద్దేశించి మాట్లాడింది అర్థం అవుతుంది. తరువాత హీరొయిన్ జెనిలియా పై న కూడా కామెంట్స్ చేసాడు. సినిమా షూటింగ్ టైం లో జెనిలియా, వాళ్ళ అమ్మ తనను ఎంత ఇబ్బంది పెట్టేరో ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగబాబు తన బాధను వేల్లగక్కినాడు.

దీనికి సంబంధించి జెనిలియా కూడా నాగబాబు మీద కామెంట్స్ మొదలు పెట్టింది. సోషల్ నెట్వర్క్ సైట్ ట్ట్విటర్ లో సమయము వచినప్పుడు మాట్లాడతాను అని తన అభిమానులకు తెలిసేలా పోస్ట్ చేసింది.

ఆరంజ్ సినిమా ఫ్లాప్ వల్ల డైరెక్టర్ గా భాస్కర్ కి హీరొయిన్ గా జెనిలియా కి పెద్ద సమస్యలని తేచిపెట్టినాయి. వీరికి సినిమా అవకాశాలు దొరకటం కష్టం అంటున్నారు సిని పండితులు.

NTR రికార్డు ని అల్లరి నరేష్ బ్రేక్ చేస్తాడ!

అల్లరి సినిమా తో సిని రంగ ప్రవేశం చేసి అతి తక్కువ సమయం లోనే ఎన్నో చిత్రాలను చేసి టాప్ హీరో లకు సైతం సాద్యం కానీ విదం గా ఏడాదికి నలుగు సినిమా లకి తగ్గకుండా తన నటన తో అకిలాంద్ర ప్రేక్షకులను ఉర్రుతలుగిస్తున్న హీరో మన అల్లరి నరేష్.

చిన్న నిర్మాతలకు దైవంగా మారిన ఈ హీరో మినిమం గ్యారెంటి హీరో గా చెరగని ముద్ర వేసుకున్నాడు. కామెడీ సినిమాలకు ప్రాధాన్యత ను ఇస్తూ శరవేగంగా సినిమాలను చేసుకుంటూ పోతున్న నరేష్ మన పెద్ద హీరో లకు ఒక మార్గదర్సకుడు అయ్యడనటం అతిశయోక్తి కాదు. 

ఇప్పడు నరేష్ స్పీడ్ ని చూస్తున్న కొంతమంది సిని ప్రముఖులు లెజండ్ N T R గారి ని బ్రేక్ చేస్తాడంటున్నారు. అప్పట్లో  N T R కానీ కృష్ణ కానీ ఏడాదికి 10 నుండి 15 సినిమాల వరకు రిలీజ్ అయ్యేలా పని చేసేవారు. అందుకే  N T R 300 సినిమాలు కృష్ణ ౩౫౦ సినిమాలు చేయగలిగారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో హీరో లు ఏడాదికి 1  లేదా 2 సినిమాలకి మించి చేయలేకపోతున్నారు. వారు తమ కెరీర్ మొత్తం లో 50 సినిమాలు చేస్తే గొప్పగా తయారవుతున్నారు. 

దీనికి బిన్నంగా నరేష్ మాత్రం ఫుల్ స్పీడ్ లో సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు హీరోలు అందరు నరేష్ ఆదర్శం గా తీసుకొని వీలైనన్ని ఎక్కువ సినిమా లు తీసెవిదంగా పని చేయాలనీ కోరుకుందాం.




కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అప్పలరాజు లో వర్మ హాట్ సాంగ్

వివాదాలకు కారణమౌతు సంచలనాలకు బిందువవుతూ పబ్లిసిటీ  చేసుకొనే దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ. సునీల్ హీరో గా స్వాతి హీరొయిన్ గా నిర్మిస్తున్న సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అప్పలరాజు.

ఈ సినిమా కు ఇప్పటికే కావలసినంత పబ్లిసిటీ మూటగట్టుకుంది. ఈ సినిమా లో ని పాటలు ఇప్పటికే హిట్ అవ్వటం తో పటు ప్రతి పాట ఎవరినో ఉద్దేశించినవి కావటం బాగా కలిసొచ్చింది.

సాక్షి గులాటి తో తీసిన ఒక పాట బాగా పాపులర్ అయింది. ఇందులో రాఘవేంద్ర రావు ని ఉద్దేశించి కొన్ని పదాలు వాడటం తో సిని పరిశ్రమలో వారంతా ఈ సినిమా గురించి టెన్షన్ పడుతున్నారు. తమను ఈ సినిమా లో ఎలా చూపించాడో అని అందరు అప్పలరాజు కోసం ఎదురు చూస్తున్నారు.