Monday, December 13, 2010

NTR రికార్డు ని అల్లరి నరేష్ బ్రేక్ చేస్తాడ!

అల్లరి సినిమా తో సిని రంగ ప్రవేశం చేసి అతి తక్కువ సమయం లోనే ఎన్నో చిత్రాలను చేసి టాప్ హీరో లకు సైతం సాద్యం కానీ విదం గా ఏడాదికి నలుగు సినిమా లకి తగ్గకుండా తన నటన తో అకిలాంద్ర ప్రేక్షకులను ఉర్రుతలుగిస్తున్న హీరో మన అల్లరి నరేష్.

చిన్న నిర్మాతలకు దైవంగా మారిన ఈ హీరో మినిమం గ్యారెంటి హీరో గా చెరగని ముద్ర వేసుకున్నాడు. కామెడీ సినిమాలకు ప్రాధాన్యత ను ఇస్తూ శరవేగంగా సినిమాలను చేసుకుంటూ పోతున్న నరేష్ మన పెద్ద హీరో లకు ఒక మార్గదర్సకుడు అయ్యడనటం అతిశయోక్తి కాదు. 

ఇప్పడు నరేష్ స్పీడ్ ని చూస్తున్న కొంతమంది సిని ప్రముఖులు లెజండ్ N T R గారి ని బ్రేక్ చేస్తాడంటున్నారు. అప్పట్లో  N T R కానీ కృష్ణ కానీ ఏడాదికి 10 నుండి 15 సినిమాల వరకు రిలీజ్ అయ్యేలా పని చేసేవారు. అందుకే  N T R 300 సినిమాలు కృష్ణ ౩౫౦ సినిమాలు చేయగలిగారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో హీరో లు ఏడాదికి 1  లేదా 2 సినిమాలకి మించి చేయలేకపోతున్నారు. వారు తమ కెరీర్ మొత్తం లో 50 సినిమాలు చేస్తే గొప్పగా తయారవుతున్నారు. 

దీనికి బిన్నంగా నరేష్ మాత్రం ఫుల్ స్పీడ్ లో సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు హీరోలు అందరు నరేష్ ఆదర్శం గా తీసుకొని వీలైనన్ని ఎక్కువ సినిమా లు తీసెవిదంగా పని చేయాలనీ కోరుకుందాం.




No comments:

Post a Comment